కరోనా ఎఫెక్ట్ రెండేళ్లు పక్కా!
కరోనా వైరస్ సమస్య ఇప్పటికి ఇప్పుడు పరిష్కారం అయ్యేది కాదని, వైరస్ జాడలు దాని మార్క్ సుమారు 18 నెలల నుంచి రెండేళ్ల వరకు ఉంటాయని అంతర్జాతీయ నిపుణుల బృందం ఒక నివేదికలో సృష్టం చేసింది. సుమారు 60 నుంచి 70 శాతం ప్రజలు కరోనా వైరస్ బారినపడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అమెరికాను వైరస్ అతలాకుతలం చేస్తోందని, రానునన కాలంలో ఉష్ణోగ్రతలు మరింత కిందికి పడిపోతాయని, ఆ సమయంలో వైరస్ ఇంతకంటే తీవ్రంగా విజృంభించే అవకాశాలు ఉన్నాయని సూచించారు. దీనికి తగిన విధంగా అమెరికా ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకోవాలని వివరించారు. జాగ్రత్త తీసుకుంటే తప్ప మరణాలు ఆగవని, భవిష్యత్తులో మృతుల సంఖ్య భారీగా పెరుగుతుదనడంలో ఎలాంటి సందేహం లేదని హెచ్చరించారు.






