కరోనా పోరాట యోధులకు అమెరికా శాల్యూట్

కరోనాపై పోరులో ప్రాణాలకు తెగించి సేవలు అందించిన వారికి కృతజ్ఞతగా నివాళులు అర్పిస్తూ అమెరికా వైమానిక, నావికా దళాలు సంయుక్తంగా మూడు నగరాల్లో విన్యాసాలు నిర్వహించాయి. థండర్‍బర్డస్, బ్లూ ఏంగెల్స్కు చెందిన పైలట్లు సంయుక్తంగా వాషింగ్టన్, బల్టిమోర్, అట్లాంటా ప్రాంతాల నగరాలపై ఈ విన్యాసాలు నిర్వహించారు. కరోనాపై పోరులో రోగులకు సేవ చేయడంలో ముందంజ వేసిన వారికి, ప్రాణాలు త్యాగం చేసిన వారికి కృతజ్ఞత తెలియచేయడంలో ముందంజ వేసిన వారికి, ప్రాణాలు త్యాగం చేసిన వారికి కృతజ్ఞత తెలియచేయడంలో అమెరికా దృఢంగా ఉంటుందన్న సంకేతాన్ని ఈ విన్యాసాల ద్వారా తెలియచేశారు. విమానం అట్లాంటా, జార్జియాలకు వెళ్లే ముందు వీరు మేరీల్యాండ్, వర్జీనియా, వాషింగ్టన్ డిసీల్లో విన్యాసాలు ప్రదర్శించారు. వాషింగ్టన్‍లో ఇంటివద్దనే ఉండాలన్న నిబంధనలు అమలవుతున్నా వాషింగ్టన్‍కు, వాషింగ్టన్ స్మారక కట్టడం మధ్య ప్రజలు గుమికూడడాన్ని ఎవరూ అడ్డుకోలేదు. 6 ఎఫ్-సి/డి ఫైటింగ్ ఫాల్కన్, 6 ఎఫ్/ఎ-18సి/డి హోర్నెట్ ఎయిర్ క్రాఫ్ దళాలు సంయుక్తంగా ఈ ప్రదర్శనలు నిర్వహించాయి.