డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాట నిజమైంది!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాట నిజమైంది. అగ్రరాజ్యంలో కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య లక్ష దాటేసింది. కరోనా ధాటికి 75 లేదా 80 వేల నుంచి లక్ష మంది ప్రజలను మనం పొగొట్టుకోబోతున్నాం. ఇది చాలా భయంకరమైన విషయం అని ట్రంప్ ఈ నెల మొదటి వారంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజా గణాంకాల ప్రకారం అమెరికాలో కరోనా కారణంగా 1,00,572 మంది మృత్యువాత పడ్డారు. ఇక కరోనా పాజటివ్ కేసుల సంఖ్య 17 లక్షలు దాటింది. ఇప్పటివరకు మొత్తం 17,25,275 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్- 19 బారిన పడిన వారిలో 4,79,969 మంది కోలుకున్నారు.






