TANA: తానా మహాసభల్లో అలూమ్ని సమావేశాలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) 24వ ద్వై వార్షిక మహాసభలు జూలై 3 నుంచి 5వ తేదీ వరకు డిట్రాయిట్ సబర్బ్ నోవైలో ఉన్న సబర్బన్ కలెక్షన్ షోప్లేస్ లో జరగనున్నది. ఈ మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలూమ్ని కమిటీ ఆధ్వర్యంలో కూడా వివిధ కార్యక్రమాలను చేస్తున్నారు. కమిటీ సభ్యులు పలు కళాశాలల పూర్వవిద్యార్థులను సంప్రదించినప్పుడు చాలామంది కాన్ఫరెన్స్‌కు వచ్చేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారని తెలిపారు. కృష్ణ్ణా జిల్లా, గుంటూరు జిల్లా, గోదావరి జిల్లా, చిత్తూరు జిల్లా ల వారీగా మీటింగ్ లు ఏర్పాటు చేశాము. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ అలూమ్ని సమావేశం కూడా ఇందులో ఏర్పాటు చేశాము. కాన్ఫరెన్స్‌కు వివిధ జిల్లాల రాజకీయ నాయకులు కూడా వస్తున్నందున ఆయా జిల్లాలవారు కూడా ఉత్సాహంగా మీటింగ్ లలో పాల్గొనేందుకు ముందుకు వస్తున్నారు. హాజరయ్యేవారి సంఖ్య కూడా బాగానే ఉంటుందని ఆశిస్తున్నాము.







