వచ్చే నెలలో కరోనా మరింత విజృంభణ
వచ్చే నెలలో కరోనా మరింత విజృంభించే ప్రమాదముందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. వచ్చే నెల 21 నుంచి 28 మధ్య కేసులు విపతీరంగా పెరుగుతాయని, ప్రతి రోజు 7 వేల నుంచి 7,500 వరకు కేసులు నమోదయ్యే అవకాశముందని పరిశోధకులు చెప్పారు. కరోనా ఉన్నప్పటికీ ఆ లక్షణాలు బయటపడనివాళ్లు ఎక్కువగా బయట తిరుగుతున్నారని, కేసుల పెరుగుదలకు ఇదే ప్రధాన కారణమని పేర్కొన్నారు. బెంగాల్‌కు చెందిన జాదవ్ పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బైరాగి, మరి కొందరు కలిసి ఈ అధ్యయనం చేపట్టారు. చైనాలోని వుహాన్‌లో 75 రోజుల లాక్డౌన్ తర్వాత వైరస్ అదుపులోకి వచ్చిందని, కానీ భారత్‌లో లాక్డౌన్ విధించిన దాదాపు రెండు నెలలు అవుతున్నా ఇంకా పరిస్థితి అదుపు లోకి రాలేదని, పైగా కేసులు పెరుగుతున్నాయని పరిశోధకులు చెప్పారు. అక్టోబర్ మొదటి వారం నాటికి దేశంలో సంఖ్య 5 లక్షల వరకు చేరవచ్చని పేర్కొన్నారు.






