Vijayasanthi: ఆయన్ను చూసే నేర్చుకున్నా
తెలుగులో ఎన్నో మరుపురాని సినిమాలతో ఆడియన్స్ ను అలరించిన విజయశాంతి నటన, టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకున్న టాలెంట్ వల్లే అందరూ ఆమెను లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు. ఇటీవల అర్జున్ సన్నాఫ్ వైజయంతీ(Arjun son of vyjayanthi) సినిమాలో కళ్యాణ్ రామ్(Kalyan Ram) కు తల్లిగా నటించి మెప్పించి విజయశాంతి(Vijayasanthi), ఆ సినిమాలో కర్తవ్యంలోని వైజయంతిని గుర్తు చేసి అందరినీ అలరించింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
నిన్న తరానికి తానెలాంటి నటిననే విషయం తెలుసని, ఈ తరనికి కూడా అది తెలియాలనే ఉద్దేశంతోనే తాను అర్జున్ సన్నాఫ్ వైజయంతీ సినిమా చేశానని, ఈ సినిమాలోని యాక్షన్ తనకు ఛాలెంజింగ్ గా అనిపించిందని, అందుకే ఈ మూవీని ఒప్పుకున్నానని చెప్తున్న విజయశాంతి, ఈ సినిమా చూశాక రాములమ్మను ఎలా చూడాలనుకున్నామో అలానే చూశామని ఆడియన్స్ చెప్తుంటే సంతోషంగా ఉందని తెలిపింది.
ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న సిట్యుయేషన్స్ ను గమనించానని, అందుకే సినిమాను చంపేయొద్దని మాట్లాడానని, చిత్ర పరిశ్రమపై ఆధారపడి ఎతోమంది బతుకుతున్నారని అందుకే కనీస బాధ్యత వ్యవహరించాలని చెప్పానన్నారు. అందరూ హీరోలతో సమానంగా హీరోయిన్లను గౌరవించాలని, ఆ రోజుల్లో ఎన్టీఆర్(NTR) తన కంటే ఎంత చిన్నవాళ్లనైనా సరే మీరు అనే సంబోధించేవారని, ఆయన్ని చూసే ఇతరులతో గౌరవంగా ఎలా ఉండాలనే విషయాన్ని నేర్చుకున్నట్టు విజయశాంతి తెలిపింది.






