Urvashi: నా పరిస్థితి నా కూతురికి రాకూడదు
మదర్ రోల్స్, కామెడీ పాత్రలు చేస్తూ అందరినీ అలరించిన సీనియర్ నటి ఊర్వశి(Urvashi) చైల్డ్ ఆర్టిస్టుగానే కెరీర్ ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మెల్లిగా హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది. దక్షిణాదిలో వందకి పైగా సినిమాలు చేసిన ఊర్వశికి ఓ కొడుకు, కూతురు ఉండగా, త్వరలోనే ఆమె కూతురు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుందని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
తాను చిన్నప్పుడే సినిమాల్లోకి రావడం వల్ల చదువు మానేయాల్సి వచ్చిందని, తన సిట్యుయేషన్ తన కూతురికి రాకూడదని కోరుకుంటున్నానని, అందుకే తన చదువులు పూర్తై మంచి ఉద్యోగం వచ్చేవరకు ఇండస్ట్రీలోకి రావొద్దని చెప్పానని, రీసెంట్ గానే తన కూతురి చదువులు పూర్తయ్యాయని, ఇప్పుడు తన ఇష్టమొచ్చిన రంగంలో కంటిన్యూ అయ్యే అవకాశాలు తనకున్నాయని ఊర్వశి అన్నారు.
ప్రస్తుతం తన కూతురికి మంచి అవకాశాలొస్తున్నాయని, స్టోరీ విని ఆ సినిమా చేయాలా వద్దా అని నిర్ణయం తనే తీసుకుంటుందని, నిజంగా సినిమాల్లోకి వచ్చి యాక్టింగ్ చేయాలని తన కూతురు కోరుకుంటే మాత్రం తల్లిగా అది తనకు ఎంతో సంతోషాన్నిస్తుందని ఊర్వశి తెలిపారు. ప్రస్తుతం ఊర్వశి తన భర్త దర్శకత్వంలో ఎల్. జగదాంబ సెవెన్త్ క్లాస్ బి(L. Jagadhamba 7th Class B) అనే సినిమాలో నటిస్తున్నారు. తన భర్త డైరెక్టర్ అయినంత మాత్రాన సెట్స్ లో రిలాక్స్ అవనని, సెట్స్ లో కాలు పెట్టాక తాను నటిని మాత్రమేనని, కెమెరా ముందు ఆయన చెప్పినట్టు నటించడమే తన పని అని ఆమె తెలిపారు.






