సినీ జర్నలిస్ట్స్‌కి అండగా ‘తెలుగు ఫిలిం జర్నలిస్టుల సంఘం’ నిత్యావసరాల పంపిణీ
కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన కష్టాలు వర్ణనాతీతం. ఈ మహమ్మారి ఎఫెక్ట్‌తో ప్రపంచం మొత్తం అతలాకుతలమవుతుంది. దీని నుంచి ప్రజలని కాపాడేందుకు ప్రభుత్వాలన్నీ లాక్డౌన్ ప్రకటించాయి. ఈ లాక్డౌన్ కారణంగా ఎందరో ఉపాధిని కోల్పోయారు. ఒక పక్క తెలుగు సినిమా ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్‌లలో ఉన్న కార్మికులకు సిసిసి ద్వారా పెద్దలు సహాయం అందిస్తున్నారు. అయితే వారంలో ఏ రోజూ సెలవు అనే మాట లేకుండా తెలుగు సినిమా కబుర్లు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోని సినిమా అభిమానులకి చేరవేర్చే సినిమా జర్నలిస్ట్‌ల కోసం మేమున్నామంటూ తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్అ సోసియేషన్ అండగా నిలబడి మరొక్కసారి నిత్యావసరాలను అందించి గొప్పమనసును చాటుకుంది ఇంతకుముందు 35 మంది తెలుగు సినిమా పాత్రికేయులకి నెలరోజులకి సరిపడా నిత్యావసర సరుకులు అందించిన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్..
తాజాగా మే 7వ తేదీనాడు దాదాపు 70 మందికి పైగా తెలుగు సినిమా పాత్రికేయులకి నిత్యావసర సరుకులను అందించింది. పీఆర్వో ఏలూరు శ్రీను ఆధ్వర్యంలో గురువారం జర్నలిస్ట్‌లకు ఈ అసోసియేషన్ నిత్యావసరాలను అందించింది. ఈ కష్టకాలంలో నెలరోజులకు సరిపడా నిత్యావసరాలను అందుకున్న పాత్రికేయులు.. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి. లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు వైజె రాంబాబు, ప్రధాన కార్యదర్శి సురేంద్ర నాయుడులకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు కుటుంబానికి కూడా నిత్యావసరాలను అందించి ‘మన ఫ్యామిలీ మన అసోసియేషన్’ అనే నినాదాన్ని చాటారు ప్రెసిడెంట్ వి. లక్ష్మీనారాయణ. అలాగే నటుడు చరణ్ దీప్ ‘జస్ట్ హ్యాప్’ సేవలను కూడా అసోసియేషన్ సభ్యులు కొనియాడారు.






