Srinidhi Shetty: నానికి శ్రీనిధి ఎలివేషన్లు
నాని(nani) హీరోగా శైలేష్ కొలను(sailesh kolanu) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా హిట్3(hit3). వాల్పోస్టర్ సినిమాస్(wallposter cinemas) బ్యానర్ లో నాని ఈ సినిమాను నిర్మించాడు. ఇప్పటికే హిట్ యూనివర్స్ లో భాగంగా రెండు సినిమాలు రాగా, ఆ రెండు సినిమాలూ మంచి హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు మూడో సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. హిట్3 సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాలో నానికి జోడీగా కెజిఎఫ్(KGF) ఫ్రాంచైజ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి(sreenidhi Shetty) నటిస్తోంది. కెజిఎఫ్ సినిమాలతో మంచి క్రేజ్ దక్కించుకున్న శ్రీనిధి శెట్టి హిట్3 సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్రీనిధి మీడియాకు ఇంటర్వ్యూలిస్తూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడిస్తోంది. అందులో భాగంగానే తాను హిట్3 చేయడానికి గల కారణాన్ని బయటపెట్టింది శ్రీనిధి.
హిట్3 స్క్రిప్ట్ తన దగ్గరకు రాగానే క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఆ స్క్రిప్ట్ ఒప్పుకున్నానని, దానికి కారణం నాని అని, నాని అంటే ఒక బ్రాండ్ అని, ఆయన సినిమాల్లో నటించే ఛాన్స్ వస్తే ఎలాంటి ప్రశ్నలు అడక్కుండా వెంటనే ఒప్పుకోవాలని నానికి మంచి ఎలివేషన్స్ ఇచ్చింది శ్రీనిధి. సినిమాలో తాను నాని భార్య పాత్రలో కనిపిస్తానని, తన క్యారెక్టర్ ఎంతో స్ట్రాంగ్ గా ఉంటుందని శ్రీనిధి వెల్లడించింది.






