Samantha: సమంత ప్లానేంటి?
ఈ రోజుల్లో ఎంతలేదన్నా వారానికి రెండు మూడు సినిమాలు రిలీజవుతున్నాయి. దీంతో పోటీ ఎక్కువవుతుంది. ఏ సినిమా ప్రమోషన్స్ ద్వారా ఆడియన్స్ కి రీచ్ అవుతుందో ఆ సినిమాకు ఎక్కువ ఓపెనింగ్స్ రావడం, ప్రమోషన్స్ తక్కువైన సినిమాలకు ఓపెనింగ్స్ సరిగా రాకపోవడం కామన్ గా చూస్తున్నాం. అందుకే చిత్ర మేకర్స్ తమ సినిమాలకు విరివిగా ప్రమోషన్స్ చేసి దాన్ని ఆడియన్స్ లోకి తీసుకెళ్తూ ఉంటారు.
ఇక అసలు విషయానికొస్తే స్టార్ హీరోయిన్ సమంత(Samantha) నిర్మాతగా మారి శుభం(Subham) అనే సినిమా నిర్మించిన విషయం తెలిసిందే. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్(Tralala Moving Pictures) బ్యానర్ లో సమంత నిర్మాతగా వస్తున్న మొదటి సినిమా ఇదే. ఈ మూవీ మే 9వ తేదీన రిలీజ్ అవుతుంది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా నుంచి టీజర్ మినహా మరే కంటెంట్ బయటకు వచ్చింది లేదు.
రిలీజ్ కు రెండు వారాలే ఉన్న నేపథ్యంలో సమంత సైలెంట్ గా ఎందుకుంది? అసలు సమంత ప్లానేంటని అందరూ ఆలోచిస్తున్నారు. అయితే శుభం టీజర్ తో వచ్చిన పాజిటివిటీని మరింత పెంచాలని సమంత ట్రైలర్ ను చాలా బాగా కట్ చేయిస్తుందని, ట్రైలర్ తో హైప్ ను మరింత పెంచి ఆ తరవాత ప్రమోషన్స్ ను వేగవంతం చేయాలని సమంత ప్లాన్ చేస్తోందట. మరి నిర్మాతగా సమంత శుభంతో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.






