Samantha: రాహుల్ తో బంధానికి పేరు పెట్టలేను
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(samantha)కు ఎంత మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీసెంట్ గా కోలీవుడ్ లో జరిగిన గోల్డెన్ క్వీన్ పురస్కారాల్లో గోల్డెన్ క్వీన్ అవార్డును సొంతం చేసుకున్న సమంత ఆ ఈవెంట్ లో మాట్లాడుతూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. డైరెక్టర్, యాక్టర్ రాహుల్ రవీంద్రన్(rahul ravindran) తో తన బంధానికి పేరు పెట్టలేనని చెప్పింది.
తనకు ఆరోగ్యం బాలేనప్పుడు రాహుల్ ఉదయం నుంచి సాయంత్రం వరకు తనతోనే ఉంటూ ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడని, అతను సోదరుడా, స్నేహితుడా, కుటుంబ సభ్యుడా లేక రక్త సంబంధీకుడా అనేది చెప్పలేనని, తనతో ఉన్న బంధానికి పేరు పెట్టలేనని, తమ బంధం ఎంతో స్వచ్ఛమైనదని సమంత చెప్పింది. ఆ ఈవెంట్ లోనే సమంత తన ఫ్యాన్స్ గురించి కూడా మాట్లాడింది.
ఈ రోజు తనకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నానని, అదృష్టంతో పాటూ తాను పడిన కష్టం వల్లే తనకు ఇవాళ ఇంతమంది అభిమానులున్నారని, ఇదంతా దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నానని, మనం తీసుకునే నిర్ణయం వల్ల కెరీర్ ను నిర్ణయించలేమని, ఎవరైనా అలా డిసైడ్ చేసినా అది అబద్ధమే అవుతుందని, తెలిసీ తెలియక మనం తీసుకునే డెసిషన్స్ కెరీర్‌పై ప్రభావం చూపుతాయని సమంత చెప్పింది.






