ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్-ఎన్టీఆర్ మధ్య భీకర పోరు ఎలా ఉండబోతుంది?

ఆర్ఆర్ఆర్ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ మధ్య చేసిన కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ మూవీలోని యాక్షన్ సీక్వెన్స్‌లు చూస్తే కంట్లోంచి నీళ్లు వస్తాయని, ఏ మాత్రం రెప్పవాల్చకుండా చూసే దృశ్యాలు వుంటాయని అన్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లోనూ ఈ స్థాయిలో ఎమోషన్స్ ఉంటాయా? అని అందరూ అనుకున్నారు. మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కించడం అంత మామూలు విషయమేమీ కాదు. హీరోల ఇమేజ్, అభిమానుల అంచనాలను అందుకునేలా తెరకెక్కించడం కత్తి మీద సాము వంటిది. మరీ ముఖ్యంగా సదరు హీరోల స్క్రీన్ స్పేస్, పాటలు, ఫైట్లు, సీన్లు ఇలా ప్రతీ ఒక్క విషయంలో స్కెల్ తో కొలిచి, లెక్కలు వేసుకుని మరీ తెరకెక్కించాల్సి ఉంటుంది.
హీరోయిజాన్ని ఎలా చూపించాలి.. సగటు సినీ ప్రేక్షకుడిని ఎలా కట్టిపడేయాలో తెలిసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను ఎలా తెరకెక్కిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్‌ను ఏలేస్తోన్న ఇద్దరు పెద్ద స్టార్లను ఒకే స్క్రీన్ మీదకు తెచ్చేందుకు రాజమౌళి పూనుకున్నాడంటే ఆ కథ, కథనంలో ఉండే దమ్ము గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పటి వరకు వదిలిన మోషన్ పోస్టర్లు, ఇంట్రో టీజర్లు, పోస్టర్లు అన్నీ కూడా ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. నీరు, నిప్పు కలయిక అంటూ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల పాత్రల స్వభావాన్ని రాజమౌళి చెప్పకనే చెప్పేశారు. ఇక ఆర్ఆర్ఆర్ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ మధ్య చేసిన కామెంట్లు తెగ వైరల్ అయ్యాయి. ఈ మూవీలోని యాక్షన్ సీక్వెన్స్‌లు చూస్తే కంట్లోంచి నీళ్లు వస్తాయని అన్నారు. తాజాగా వాటిపై విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన క్లారిటీ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.