Rajendra Prasad: ఇకపై అందరినీ మీరు అనే పిలుస్తా

టాలీవుడ్ లో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్(rajendra prasad) కు యాక్టింగ్ పరంగా ఎలాంటి వంక పెట్టడానికి వీల్లేదు. కానీ ఆయన గత కొంతకాలంగా స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్న మాటలు ఆయన్ని విమర్శలు పాలు చేస్తున్నాయి. మొన్నామధ్య క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner) పై నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ రీసెంట్ గా అలీ(Ali)పై కూడా నోరు జారాడు.
దీంతో నెటిజన్లు ఆయన తీరుని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాజేంద్ర ప్రసాద్ ను ట్రోల్ చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని అలీ స్వయంగా చెప్పినా కానీ రాజేంద్రప్రసాద్ పై ట్రోల్స్ ఆగట్లేదు. పైగా తన మాటల్ని అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, అది వాళ్ల ఖర్మ, సంస్కారంపై ఆధారపడి ఉంటుందని కామెంట్స్ చేయడంతో అందరూ మరింత కోప్పడుతున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాజేంద్రప్రసాద్ ఈ విషయాన్ని ఎవరో కావాలని పెద్దది చేస్తున్నారని, మేమంతా ఒకరికొకరం ప్రేమతో ఉంటామని, అలాంటి బంధం లేకపోతే ఇంతకాలం కలిసి జర్నీ చేసేవాళ్లం కాదని, ఏదేమైనా ఈ విషయంలో తాను చాలా హర్ట్ అయ్యానని, ఇకపై లైఫ్ లో ఎవరినైనా మీరు అనే పిలుస్తానని, ఎప్పుడూ నువ్వు అనే పదం వాడనని, తన చివరి శ్వాస వరకు అందరినీ గౌరవంగానే పిలుస్తానని ఆయన అన్నారు.