The Great Pre-Wedding Show: $100K డాలర్స్ వసూళ్లతో నార్త్ అమెరికాలో దూసుకెళ్తోన్న ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’
వెర్సటైల్ యాక్టర్ తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నవంబర్ 7న వచ్చిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ (The Great Pre-Wedding Show). సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా 7PM ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా మౌత్ టాక్‌తో అద్భుతమైన స్పందనను రాబట్టుకుంటోంది. నార్త్ అమెరికాలో చిన్న చిత్రం సాధించిన మైల్ స్టోన్ ఇది. అథర్వణ భద్రకాళి పిక్చర్స్ ఈ చిత్రాన్ని ఓవర్ సీస్లో విడుదల చేశారు. వారి ప్లానింగ్, రీచ్తో ఈ సినిమాను అమెరికా, కెనడాలోని ప్రేక్షకులకు చేరవేయటంలో కీలక పాత్రను పోషించాయి.
ఇది సింపుల్‌గా, ఆశ్చర్యకరంగా అనిపించే అరుదైన విజయం. చిన్న పట్నంలో ఉండే రమేష్ అనే ఫొటోగ్రాఫర్ ప్రీ వెడ్డింగ్ షూటింగ్ చేసినప్పుడు మెమొరీ కార్డుని కోల్పోవటం కారణంగా ఏర్పడే గందరగోళమైన పరిస్థితులతో నడిచే కథతో సినిమాను తెరకెక్కించారు. మనం రోజు మన చుట్టూ ఉన్న వారిలో చూసే కామెడీ, ఆప్యాయత వంటి కోణాలను అతిశయోక్తిగా కాకుండా మనకు కనెక్ట్ అయ్యేలా చిత్రీకరించారు. సన్నివేశాల్లోని కామెడీ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఎలా ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారనే అంశాలను సహజంగా చిత్రీకరించారు. మనసుల జీవితాల్లోని డ్రామా, కామెడీ, భావోద్వేగాల్లోని నిజాయతీ కలయికగా రూపొందిన ఈ సినిమా ఏదో మిస్ అయ్యామనే భావించే ప్రేక్షకులు కోరుకునే అంశాలను సహజంగా అందించింది.
విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న ఈ సినిమా క్రమంగా ప్రేక్షకుల ఆదరణను కూడా పొందుతూ ఓవర్సీస్లో విజయవంతంగా రన్ అవుతోంది. నార్త్ అమెరికాలోని ఆడియెన్స్‌కు సినిమా బాగా కనెక్ట్ అవుతోంది. భారీ స్పెషల్ ఎఫెక్ట్స్, భారీతనంతోనే కాకుండా నిజాయతీ, నైపుణ్యంతో మంచి కథ ఉంటే చాలని మరోసారి ఈ సినిమా నిరూపించింది.






