OTT Releases: జూన్ రెండో వారం ఓటీటీ క్రేజీ మూవీస్

ఇటీవల ఓటీటీలోకి వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ(Tourist Family) సినిమాతో సౌత్ ఆడియన్స్ మంచి సినిమాను చూసిన ఫీలింగ్ ను పొందారు. జూన్ రెండో వారంలో మరకొన్ని క్రేజీ సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. వాటిలో ముందుగా రానా నాయుడు సీజన్2 రాబోతుంది. వెంకటేష్ దగ్గుబాటి(Venkatesh Daggubati), రానా దగ్గుబాటి(Rana Daggubati) కలిసి నటించిన రానా నాయుడు సీజన్2(Rana Naidu Season2) జూన్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.
ఇది కాకుండా సమంత(Samantha) నిర్మాతగా మారి చేసిన మొదటి సినిమా శుభం(Subham) కూడా ఈ వారమే రిలీజ్ కానుంది. టీజర్ తో అందరికీ మంచి అంచనాలు ఏర్పరచిన శుభం సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితాల్ని అందుకోలేకపోయింది. థియేట్రికల్ రన్ ను ముగించుకున్న ఈ సినిమా జూన్ 14న జియో హాట్‌స్టార్ లో రిలీజ్ కానుంది.
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన అలప్పుజ జింఖానా(Alappuzha Zymkhana) సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ను తెచ్చుకున్న ఈ సినిమా జూన్ 13 నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కు రానుంది. దీంతో పాటూ పదక్కలం(Padakkalam) అనే మలయాళ టైటిల్ తో వస్తున్న మరో సినిమా జూన్ 10 నుంచి జియో హాట్ స్టార్ లో రిలీజ్ కానుంది. ఇక అల్లరి నరేష్(Allari Naresh) హీరోగా వచ్చిన ఆ ఒక్కటి అడక్కు(Aa Okkati Adakku) సినిమా థియేటర్లలో రిలీజైన ఇన్ని నెలల తర్వాత ఇప్పుడు జూన్ 12న చాలా ఆలస్యంగా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కు రానుంది.