Mega May: మెగా ఫ్యాన్స్ కు మే2025 చాలా స్పెషల్
2025 మే నెల మెగా ఫ్యాన్స్ కు చాలా స్పెషల్ కానుంది. అయితే దానికి కారణం ఒకటి కాదు, పలు కారణాలున్నాయి. అందులో ఫస్ట్ రీజన్, మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన ఐకానిక్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి(jagadeka Veerudu athiloka sundari) రిలీజై మే 9వ తేదీ నాటికి 35 ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఆ సినిమాను మేకర్స్ రీరిలీజ్ చేస్తున్నారు. ఈ రీరిలీజ్ 2డీ, 3 డీ ఫార్మాట్లో అందుబాటులోకి రానుంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(ram charan) మైనపు విగ్రహం కూడా అదే రోజున ఆవిష్కరించబడుతుంది. లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్(Madame tussads) లో రామ్ చరణ్ మైనపు విగ్రహం ఇప్పటికే ఏర్పాటు కాగా, మే 9వ తేదీన ఆ విగ్రహం ఓపెన్ కానుంది. ఈ కార్యక్రమానికి చరణ్ తన ఫ్యామిలీతో హాజరు కానున్నాడు. దీంతో పాటూ రాయల్ ఆల్బర్ట్ హాల్(Royal Albert Hall) లో జరిగే ఆర్ఆర్ఆర్(RRR) లైవ్ ఆర్కెస్ట్రా కు కూడా చరణ్ వెళ్తున్నాడు.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) తను ఎప్పట్నుంచో చేస్తున్న హరిహర వీరమల్లు(harihara veeramallu)ను పూర్తి చేయాలని చూస్తున్నాడు. మేలో వీరమల్లు షూటింగ్ ను పూర్తి చేసి, డబ్బింగ్ ను కూడా ఫినిష్ చేయాలని, దాంతో పాటూ అందరూ ఎప్పట్నుంచో వెయిట్ చేస్తున్న ఓజి(OG) సినిమా షూటింగ్ ను కూడా పవన్ మొదలుపెట్టాలని చూస్తున్నాడని అంటున్నారు. ఇలా ఈ ఏడాది మే మెగాఫ్యాన్స్ కు చాలా స్పెషల్ కానుంది.






