Malavika Mohanan: మేకప్ లేకపోయినా మరింత అందంగా మాళవిక

మాళవిక మోహనన్(Malavika Mohanan) మలయాళ, కన్నడ, తమిళ, హిందీ ఆడియన్స్ కు సుపరిచితురాలే. ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లవుతున్నా ఇప్పటివరకు మాళవిక తెలుగులో సినిమా చేసింది లేదు. ప్రస్తుతం ప్రభాస్(Prabhas) సరసన రాజా సాబ్(raja saab) సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న మాళవిక కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగే ఉంది. ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉండే మాళవిక తాజాగా బ్లాక్ అండ్ వైట్ అవుట్‌ఫిట్ లో కనిపించింది. ఈ అవుట్‌ఫిట్ లో మాళవిక ఎంతో అందంగా కనిపించింది. జీబ్రాలున్న ఈ డ్రెస్ లో మాళవిక ఎలాంటి మేకప్ లేకుండా సింపుల్ లుక్ లో కనిపించింది. మేకప్ లేకపోయినా మాళవిక మరింత అందంగా ఉందని నెటిజన్లు ఆమె ఫోటోకు కామెంట్స్ చేస్తున్నారు.