Jatayu: నా డ్రీమ్ ప్రాజెక్ట్ అదే!
గ్రహణం(Grahanam) సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ(Indraganti Mohanakrishna) ఫస్ట్ మూవీతోనే జాతీయ అవార్డు అందుకుని తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నారు. మంచి అభిరుచి, తెలుగుదనం నిండిన సినిమాలు చేసే అతి కొద్ది మంది డైరెక్టర్లలో ఇంద్రగంటి కూడా ఒకరు. ఆయన నుంచి వచ్చిన అష్టాచెమ్మా(Ashtachemma), జెంటిల్మెన్(Gentle man), సమ్మోహనం (Sammohanam) సినిమాలు మంచి హిట్లుగా నిలిచాయి.
ఇంద్రగంటి కెరీర్ స్టార్టింగ్ నుంచి చిన్న, మీడియం రేంజ్ సినిమాలే చేస్తూ వచ్చారు తప్పించి ఎప్పుడూ స్టార్ హీరోలతో సినిమాలు చేసింది లేదు. అయితే అందరిలానే తనకు కూడా ఓ భారీ బడ్జెట్ సినిమా తీయాలనుందని, దాని కోసం తన దగ్గర జటాయు(Jataayu) అనే స్క్రిప్ట్ రెడీగా ఉందని, ప్రముఖ నిర్మాత దిల్ రాజు(dil Raju) ఆ సినిమాను రూ.200 కోట్లతో తీస్తానని ముందుకొచ్చారని అప్పట్లో వార్తలొచ్చాయి.
అంతా సెట్ అయిందునుకున్న టైమ్ లో ఆ ప్రాజెక్టు ముందుకెళ్లలేదు. తాజాగా ఈ విషయంలో ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడారు. సారంగపాణి జాతకం(Sarangapani Jathakam) కంటే ముందే తాను జటాయు చేద్దామనుకున్నానని, దిల్ రాజు కూడా ఓకే చెప్పాడని కానీ గేమ్ ఛేంజర్(game changer) లేటవుతుండటంతో మధ్యలో మరో సినిమా చేసుకుని రమ్మని దిల్ రాజు చెప్పాడని, ఎప్పటికైనా జటాయు సినిమాను తీస్తానని, అది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఇంద్రగంటి చెప్పుకొచ్చారు.






