Fatima Sana Shaik: వైట్ శారీలో దేవకన్యలా మెరిసిపోతున్న ఫాతిమా
రీసెంట్ గా గుస్తాక్ ఇష్క్(gustaakh ishq) మూవీతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఫాతిమా సనా షేక్(Fatima sana shaik) ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుందనే సంగతి తెలిసిందే. గుస్తాక్ ఇష్క్ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొన్న ఫాతిమా, వాటి కోసం ఎంచుకున్న దుస్తులు అందరినీ తెగ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. అయితే ఫాతిమా తాజాగా వైట్ అండ్ వైట్ డిజైనర్ శారీలో అమ్మడు ఇచ్చిన పోజులు అందరి దృష్టిని తెగ ఆకర్షిస్తున్నాయి. మనీష్ మల్హోత్రా(Manish malhotra) డిజైన్ చేసిన ఈ శారీలో ఫాతిమా మరింత అందంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.






