Divi: స్టైలిష్ లుక్ లో దివి
సోషల్ మీడియా లో తనకంటూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న దివి(Divi) బిగ్ బాస్(Bigg Boss) షో ద్వారా ఆడియన్స్ కు మరింత దగ్గరైంది. ఆ షో తో తన పాపులారిటీని మరింత పెంచుకున్న దివి పలు సినిమాల్లో నటించింది. సినిమాల్లో కంటే సోషల్ మీడియా ద్వారా తన క్రేజ్ ను పెంచుకుంటూ వార్తల్లో నిలుస్తున్న దివి రీసెంట్ గా కొన్ని ఫోటోలను షేర్ చేసి మరోసారి వార్తల్లోకెక్కింది. లైట్ పింక్ కలర్ శాటిన్ హై స్లిట్ గౌన్ లో దివి పోజులు అందరినీ మెప్పిస్తున్నాయి. ఈ డ్రెస్ లో దివి అందాలు, పోజులు, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, కర్లీ హెయర్ స్టైల్ అమ్మడిని మరింత హైలైట్ చేశాయి. దివి షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.






