Fashion: ‘పేషన్’ ఇంటెన్స్ ఎమోషన్స్ వున్న ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్ – శేఖర్ కమ్ముల
యంగ్ ట్యాలెంటెడ్ సుధీస్, అంకిత హీరో హీరోయిన్స్ గా అరవింద్ జాషువా దర్శకత్వంలో రూపొండుతున్న ఇంటెన్స్ ఎమోషనల్ లవ్ స్టొరీ ‘పేషన్’ (Fashion). REDANT క్రియేషన్ బ్యానర్ పై నరసింహా యేలే, ఉమేష్ చిక్కు, రాజీవ్ సింగ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల లాంచ్ చేశారు.
ఫస్ట్ లుక్ లాంచ్ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. అరవింద్ జాషువా ఆనంద్ సినిమా నుంచి నాకు పరిచయం. అప్పటిలోనే తనలో స్టోరీ టెల్లింగ్ రైటింగ్ క్రియేటర్ ఉన్నాడని అనిపించింది. తను పేషన్ అని ఒక నవల రాశారు. అది నేను చదివాను. చాలా బాగుంది. తను వచ్చిన ఫ్యాషన్ బ్యాక్ గ్రౌండ్ గురించి ఇందులో రాశారు. అందుకే చాలా అథెంటిక్ గా ఉంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్. ఈ సినిమా చాలా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అరవింద్ మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. స్క్రిప్ట్ చాలా బాగుంది. నిర్మాతలు అందరూ కొత్తవాళ్లు. వీళ్లంతా చాలా ప్యాషన్ తో సినిమా తీస్తున్నారు. వాళ్ళందరికీ కంగ్రాట్యులేషన్స్. ఈ పోస్టర్ డిజైన్ చాలా బాగుంది. టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. కొత్త ఫ్లేవర్ తో వచ్చిన సినిమాలుని ఆడియన్స్ ఆదరిస్తారు. ఈ సినిమాని కూడా అంత అద్భుతంగా ఆదరిస్తారని నమ్ముతున్నాను. టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్’అన్నారు.
ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ మూవీ పుట్టకముందు నవలగా పబ్లిష్ చేయబడిన ఛాయా పబ్లికేషన్స్ కి థాంక్యూ. ఈ నవల చదివిన తర్వాత అందరూ ఇన్స్పైర్ అయ్యి మూవీ గా తీసుకురావాలనే తపని అందరూ అర్థం చేసుకున్నారు. శేఖర్ కమ్ముల గారి బ్లెస్సింగ్స్ లేకపోతే ఈ మూవీ అయ్యేది కాదు. ఆయన బిజీ షెడ్యూల్లో ఉన్నప్పుడు కూడా ఈ సినిమాకి సపోర్ట్ చేయడానికి వచ్చారు మా అందరి తరపున శేఖర్ కమ్ముల గారికి ధన్యవాదాలు. ఈ సినిమా చాలా మంచి మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’అన్నారు
డైరెక్టర్ అరవింద్ జాషువా మాట్లాడుతూ.. పేషన్ సినిమా కాన్వాస్ చాలా పెద్దది. చాలా పెద్ద పెద్ద వాళ్ల పిల్లలు చదివే ఒక ఫ్యాషన్ కాలేజీలో నాలాంటి ఒక సామాన్యుడు చదివితే ఎలా ఉంటుందో ఒరిజినల్ గా నేను ఫీల్ అయి రాసిన కథ ఇది. నేను శేఖర్ కమ్ముల గారికి ఏకలవ్య శిష్యుడ్ని. ఆయనతో 20 ఏళ్లుగా జర్నీ ఉంది. శేఖర్ కమ్ముల గారి పేషన్ చూసి నాకు సినిమా ఇండస్ట్రీపై గౌరవం పెరిగింది . మా నిర్మాతలు చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమా కంటే ముందు ఈ కథ ఒక నవలగా పబ్లిష్ చేసిన ఛాయా పబ్లికేషన్స్ వారికి ధన్యవాదాలు. డిఓపి సురేష్ నటరాజన్ సినిమాకి మెయిన్ పిల్లర్. మ్యూజిక్ డైరెక్టర్ హెర్నీ చాలా మంచి ట్యూన్స్ ఇచ్చాడు. ఆడియన్స్ పాటలు వినబోతున్నారు. గాంధీ గారు చాలా పెద్ద ఆర్ డైరెక్టర్ నామీద నమ్మకంతో ఈ ప్రాజెక్టులోకి వచ్చి చాలా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. టైటిల్ సూచించినట్లుగా ఇది ఇంటెన్స్ ఎమోషన్స్ తో కూడిన లవ్ స్టోరీ. ఇందులో న్యూ టాలెంట్ సుధీస్, అంకిత చాలా పేషన్ తో వర్క్ చేశారు. వాళ్ల పాత్రలు చాలా అద్భుతంగా ఉంటాయి. మిగతా నటీనటులు అందరూ కూడా చాలా చక్కని పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఈ జనరేషన్ కి కనెక్ట్ అయ్యే కథ ఇది. త్వరలోనే సినిమా థియేటర్స్ లోకి రానుంది. అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’అన్నారు.






