Chiranjeevi: తన ఫిట్‌నెస్ కారణమేంటో చెప్పిన మెగాస్టార్

ఈ వయసులో కూడా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) యంగ్ హీరోలకు పోటీగా స్టెప్పులేసి అలరిస్తున్నాడు. అందుకే ఆయన్ని, ఆయన ఎంతో గ్రేస్ తో చేసే డ్యాన్సుల్ని ఆడియన్స్ మెచ్చుకుంటూ ఉంటారు. పాలిటిక్స్ లోకి వెళ్లినప్పుడు కాస్త ఒళ్లు చేసిన చిరూ(Chiru), ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చి స్లిమ్ గా మార ఫిట్‌నెస్ మెయిన్‌టెయిన్ చేస్తూ అందరికీ ఓ ఉదాహరణగా నిలిచాడు.
అయితే తాను ఫిట్ గా ఉండటానికి గల రీజన్ ను చిరంజీవి రీసెంట్ గా బయటపెట్టాడు. యోగా వల్లే తానెంతో ఆరోగ్యంగా ఉంటున్నానని చెప్పిన మెగాస్టార్, యోగా(Yoga) ఇంపార్టెన్స్ ను వివరిస్తూ ఓ పోస్ట్ చేశాడు. ప్రపంచానికి భారత్ ఇచ్చిన గొప్ప బహుమతి యోగా అని, జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే ను అందరూ కలిసి జరుపుకోవాలని సూచించారు.
ఫోకస్ వల్ల ఫిట్‌నెస్ పెరుగుతుందని, కానీ యోగా అటు ఫిట్‌నెస్ తో పాటూ ఫోకస్ ను కూడా పెంచుతుందని, అందుకే ఈ సంవత్సరం యోగా ను బోర్డర్లను దాటి సెలబ్రేట్ చేసుకుందామని ఆయన రాసుకొచ్చాడు. మన ఆరోగ్యాన్ని నేచురల్ గా మెరుగుపరచడంలో యోగా ఎంతో సాయపడుతుందని చిరూ చెప్పాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తన 157(Mega157)వ సినిమాను చేస్తున్న చిరంజీవి ఆ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు.