Anupama Parameswaran: గోల్డెన్ పింక్ శారీలో మెరిసిపోతున్న అనుపమ

అ..ఆ(AAa) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ఆ తర్వాత పలువురు హీరోలతో కలిసి నటించి పక్కింటి అమ్మాయనే పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం అనుపమ జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ(Janaki Vs State of Kerala) అనే సినిమా లో నటిస్తోంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే అనుపమ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది. తాజాగా అనుపమ గోల్డెన్ పింక్ బెనారస్ శారీ ధరించి దానికి తగ్గ జ్యుయలరీలో కనిపించి అందరి చూపునీ తనవైపు తిప్పుకుంది. ఈ చీరలో అనుపమ ఎంతో చూడముచ్చటగా తన నవ్వుతో అందరినీ ఇట్టే ఆకర్షిస్తోంది. అనుపమ షేర్ చేసిన ఈ ఫోటోలకు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.