Anasuya Bharadwaj: పూల్ అందాలను డామినేట్ చేస్తున్న అనసూయ

బుల్లితెర యాంకర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj), తర్వాత టెలివిజన్ హోస్ట్ గా మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి మంచి పాపులారిటీని తెచ్చుకున్న అనసూయ, ఇప్పుడు యాంకరింగ్ కు గుడ్ బై చెప్పి సినిమాల్లోనూ, కొన్ని రియాలిటీ షోలకు జడ్జిగానూ కనిపిస్తూ అలరిస్తోంది. అయితే అనసూయ కెరీర్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను అందిస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. అందులో భాగంగానే అనసూయ తాజాగా స్విమ్మింగ్ పూల్ ఫోటోలను షేర్ చేసింది. బ్లాక్ కలర్ స్విమ్ సూట్ లో అనసూయ పూల్ లో సేద తీరుతున్న ఫోటోలు అందరినీ స్పెషల్ గా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. సన్ గ్లాసెస్ తో స్టైలిష్ గా కనిపించిన అనసూయ బికినీ కంటే ఆమె లుక్స్ ఇంకా ఘాటుగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ, ఆ ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.