ఎక్స్‌లో మరో సదుపాయం..త్వరలో లావాదేవీలు!

ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌ను సొంతం చేసుకున్నప్పటి నుంచి బిలియనీర్ ఎలాన్ మస్క్ ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. కేవలం సమాచారం పంచుకోవడానికి మాత్రమే ఉపయోగించిన యాప్‌ను ఇప్పుడు ఆన్ ఇన్ వన్ యాప్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే పేమెంట్స్ ఫీచర్‌ను పరిచయం చేయనున్నట్లు సమాచారం. ట్విటర్‌ను ఎక్స్ గా మార్చాక దీన్నో సూపర్ యాప్‌గా తీర్చిదిద్దుతానని ఎలాన్ మస్క్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఆడియో, వీడియో కాల్స్ సాదుపాయం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ముందడుగు వేసి తన ప్లాట్‌ఫామ్ వేదికగా పేమెంట్స్ జరిపే సదుపాయాన్ని తీసుకురావాలని చూస్తోంది. అంటే ఇకపై ఎక్స్ సాయంతోనే ఆన్‌లైన్ పేమెంట్స్ చేయొచ్చన్నమాట. ఈ కొత్త ఫీచర్లకు సంబంధించి స్క్రీన్ షాట్ చీఱఎa ూషjఱ అనే ఓ వెబ్ డెవలపర్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. త్వరలోనే పేమెంట్స్ యాప్ రానుందని వెల్లడిరచారు. లావాదేవీలు జరపడంతో పాటు, బ్యాలెన్స్, పేమెంట్స్, హిస్టరీ కూడా అక్కడే తెలుసుకోవచ్చు. అయితే ఎక్స్‌లో రాబోయే ఈ ఫీచర్ వాలెట్ సిస్టమ్ లాగా ఉంటుందా? లేదా నేరుగా బ్యాంక్ ఖాతాలకు లింక్ చేయొచ్చా? అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.