ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద లాటరీ… దీంతో ఆయన జీవితమే
ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద లాటరీని గెలుచుకున్నారు ఎడ్విన్ క్యాస్ట్రో. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఎడ్విన్ క్యాస్ట్రో గత నెలలో ఏకంగా 2.04 బిలియన్ డాలర్ల (రూ.16 వేల కోట్లకు పైగా) లాటరీ గెలుచుకున్నారు. దీంతో ఆయన జీవితమే మారిపోయింది. తాజాగా 25.5 మిలియన్ డాలర్లు (రూ.200 కోట్లకు పైగా ) ఖర్చు పెట్టి అత్యంత విలాసవంతమైన పెద్ద భవనం కొనుకున్నారు. ఇందులో ఐదు బెడ్ రూమ్లు, ఆరు బాత్రూమ్లున్నాయి. అలాగే పెద్ద ఈత కొలను, థియేటర్, వైన్ సెల్లార్, గేమ్ రూమ్, జిమ్ కూడా ఉన్నాయి. కాగా, ఈ లాటరీ ప్రైజ్మనీ ఎంతనేది ముందుగా చెప్పరు. టికెట్ల అమ్మకాలు, పోటీ వంటి అంశాల ఆధారంగా లాటరీ మొత్తాన్ని నిర్వాహకులు నిర్ణయిస్తారు. అమెరికాలోని 45 రాష్ట్రాల్లో కాలిఫోర్నియా లాటరీ నిర్వాహకులు పవర్ బాల్ జాక్ పాట్ పేరుతో లాటరీ ఆడిస్తుంటారు. ఇందులోనే ఎడ్విన్కు అదృష్టం వరించింది. ఇంతకు ఎడ్విన్ ఎంతకు లాటరీ కొన్నారో తెలుసా కేవలం 2 డాలర్లు (రూ.165)కు మాత్రమే.






