అందుకు 30 రోజులే గడువు : శ్వేతసౌధం
అమెరికాలోని అన్ని ఫెడరల్ సంస్థలు తమవద్దనున్న ప్రభుత్వ ఎలక్ట్రానిక్ పరికరాల్లో 30 రోజుల్లోగా చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌ను తొలగించాలని శ్వేతసౌధం ఆదేశించిది. రక్షణ, విదేశీ వ్వహారాలు, హోమ్‌ల్యాండ్ భద్రత వంటి శాఖల్లో ఇప్పటికే టిక్‌టాక్ వినియోగంపై ఆంక్షలు ఉన్నాయి. ఇప్పుడు మిగిలిన ప్రభుత్వ సంస్థలన్నీ తాజా ఆదేశాలను 30 రోజుల్లోగా పాటించాల్సి ఉంటుంది. శ్వేతసౌధానికి చెందిన అన్ని ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఇప్పటికే టిక్‌టాక్‌ను అనుమతించడం లేదు. సున్నితమైన ప్రభుత్వ డేటాకు యాప్ నుంచి తలెత్తిన ముప్పులను పరిష్కరించడంలో ఇది కీలకమైన ముందడుగు అని సోమవారం జారీచేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.






