వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్
వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది. ఎక్స్‌పై రింగ్ గ్రూప్ పేరుతో తెస్తున్న ఈ ఫీచర్ సాయంతో తాత్కాలిక గ్రూప్‌లను క్రియేట్ చేయొచ్చు. అడ్మిన్ ఎంపిక చేసిన నిర్ణీత గడువు తర్వాత వాటంతటవే డిలీట్ అయిపోతాయి. ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే సాధారణ యూజర్లకు అందుబాటులోకి రానుంది. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసే సమయంలోనే అడ్మిన్ ఎక్స్‌ఫైరింగ్ గ్రూప్స్ అనే ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఒకరోజు, వారం, కస్టమ్ డేట్, రిమూవ్ ఎక్స్‌పైరేషన్ డేట్ అనే వాటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. ఒకవేళ గ్రూప్ డిలీట్ అవ్వాల్సిన తేదీ తర్వాత కూడా కొనసాగాలనుకుంటే రిమూవ్ ఎక్స్‌పైరేషన్ డేట్‌ను ఎంచుకోవాలి. దాంతో గ్రూప్ అడ్మిన్ డిలీట్ చేసే వరకు గ్రూప్ లైవ్‌లో ఉంటుంది. అయితే గ్రూప్‌లోని ఇతర పార్టిసిపెంట్లకు ఇది వర్తించదు. అందుబాటులోకి వచ్చే ఈ కొత్త ఫీచర్ మంచి స్టోరేజీ టూల్‌గా ఉపయోగపడనుంది. యూజర్లకు వాట్సాప్ గ్రూప్‌లను నిర్వహించడంలో ఎంతో సమయం ఆదా కానుంది.






