వాట్సాప్ లో మరో సూపర్ ఫీచర్!
ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకువస్తుంది. ఇప్పటికే కొత్తగా ఎన్నో ఫీచర్స్‌ను తీసుకువచ్చిన మెటా యాజమాన్యంలోని కంపెనీ మరో సరికొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. ప్రయోగాత్మకంగా ఫీచర్‌ను పరీక్షించిన తర్వాత కంపెనీ విడుదల చేసింది. ఈ ఫీచర్‌ను చాట్‌లాక్ పేరు పెట్టింది. వాట్సాప్‌లో సంభాషణలు, చాట్లను ఈ ఫీచర్‌తో మరింత గోప్యంగా ఉంచుకోవచ్చు. పాస్వర్డ్ ప్రొటక్షన్, ఫింగర్ ప్రింట్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేసేందుకు వీలుంటుంది. దాంతో ఇతరులెవరూ మీ చాట్‌ను చూడలేరు. చాట్స్, సంభాషణలను లాక్ చేయడమే కాకుండా ప్రత్యేక ఫోల్డర్లో వాటిని స్టోర్ చేస్తుంది. వేరే వ్యక్తులు యాక్సెస్ చేసేందుకు ప్రయత్నిస్తే చాట్ మొత్తాన్ని ఎరేజ్ చేయాలని కోరుతుంది. చాట్ లాక్ ఫీచర్‌ను పరిచయం చేసినందుకు సంతోషంగా ఉందని మార్క్ జుకర్ బర్గ్ పేర్కొన్నారు. యూజర్ల సీక్రెట్ సంభాషణలు, చాట్స్‌కు అదనపు సెక్యూరిటీని అందించే కొత్త ఫీచర్ చాట్ లాక్ అని తెలిపారు. ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.






