బిజినెస్, పర్యాటక వీసాలకు…. ఇంటర్వ్యూలు
అమెరికాకు పర్యాటక, బిజినెస్ వీసాపైనా దేశంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఇంటర్వ్యూలకు సైతం హాజరవ్వొచ్చని ఇక్కడి ఫెడరల్ ఏజెన్సీ వెల్లడించింది. బి-1, బి-2 వీసాదారులకు ఈ అవకాశం ఉందని స్పష్టం చేసింది. అయితే, ఉద్యోగాల్లో చేరే ముందు మాత్రం వీసాను మార్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. బి-1, బి-2 వీసాలను బి వీసాలుగా పేర్కొంటారు. అమెరికాలో పర్యటన కోసం ఈ వీసాలు జారీ చేస్తారు. బి-1 వీసా తాత్కాలిక బిజినెస్ ట్రిప్ కోసం ఉద్దేశించినది కాగా, పర్యాటకానికి వచ్చిన వారికి బి-2 వీసాలను జారీ చేస్తారు. ఇటీవల అమెరికాలో పలు కంపెనీలు లేఆఫ్‌లు ప్రకటించాయి. దీంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అలాంటి వారికి ఈ తరహా ఆప్షన్ ఒకటి ఉందని తెలియజేయడం కోసం యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ తెలిపింది.






