టిక్‌టాక్ కు మరో వారం రోజుల గడువు…
ప్రస్తుతం అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా విభాగం చైనీస్ యాప్ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ విక్రయానికి మరో వారం రోజుల పాటు గడువును పెంచింది. ఈ మేరకు కోర్టుకు సమచారం ఇచ్చింది. దీంతో డిసెంబరు 4వ తేదీలోగా టిక్‌టాక్‌ను విక్రయించడానికి బైట్ డ్యాన్స్ కు సమయం దొరికింది. టిక్‌టాక్‌ను అమెరికా సంస్థలకు విక్రయించాలని ట్రంప్ పాలనా వర్గం ఆగస్టులో ఆదేశించింది. ఈ గడువును పలుమార్లు పొడిగించింది. తాజాగా 27వ తేదీతో గడువు ముగియడంతో మరో వారం రోజులు పెంచింది. మొదట ఆగస్టు ప్రారంభంలో 45 రోజుల గడువు ఇచ్చారు. ఇప్పుడు దానిని 90 రోజులకు నవంబరు 12వ తేదీకి పొగించారు. అనంతరం మరో 15 రోజులు పొడిగించి, నవంబరు 27వ తేదీ వరకు అవకాశమిచ్చారు. ఇప్పుడు మరో వారం పొడిగింపు లభించింది.
ట్రంప్ పరిపాలనా వర్గం ప్రకారం, నిర్దేశించిన గడువులోగా టిక్‌టాక్ అమ్మకం పక్రియను బైట్‌డాన్స్ పూర్తిచేయాలి. అమెరికన్ యూజర్ల డేటాను పూర్తిగా తొలగించాలి. అమెరికా జాతీయ భద్రతను బైట్‌డ్యాన్స్ ప్రమాదంలోకి నెట్టివేస్తోందనేందుకు తగిన ఆధారాలున్నాయని ట్రంప్ తన గత ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. టిక్‌టాక్ యాప్ విలువ 50 బిలయన్ డాలర్లుగా అంచనా వేస్తోంది. అమెరికాలో టిక్‌టాక్‌కు 100 మిలియన్ల యూజర్లు ఉన్నారు.






