అమెరికాలో రాత్రికి రాత్రే.. 2,700 మంది ఉద్యోగాలు గల్లంతు!
రాత్రికే రాత్రే ఉద్యోగాలందర్నీ నౌకరి నుంచి తీసిపారేసిందా సంస్థ. కనీసం నోటీసులివ్వకుండా ఇక రేపట్నుంచి మీరు పనికి రావొద్దు అని ఫోన్లకు మెసేజ్లు పెట్టి సరిపెట్టేసింది. అమెరికాలోని సోఫాలు, కుర్చీలు తదితర గృహోపకరణాలను తయారు చేసే యునైటెడ్ ఫర్నీచర్ ఇండస్ట్రీస్ అనే సంస్థ తీరిది. సంస్థలో 2,700 మంది ఉద్యోగులు పనిచేస్తుంటే అందర్నీ పనిలోంచి తొలగించేసింది. ఆకస్మికంగా వచ్చిపడ్డ ఆర్థిక ఒడుదుడుకుల వల్ల కొలువుల నుంచి మిమ్మల్ని తొలగించాల్సి వస్తోందని, ఇది తక్షణం వర్తిస్తుందని నవంబరు 21న ఉద్యోగులకు సందేశాలు పంపింది. గత జూన్ నుంచే ఈ సంస్థకు ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయని తెలిపింది.






