ఎలన్ మస్క్ కి భారీ ఝలక్!
ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్‌కి మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్ సహా తొలగించబడిన మాజీ ఎగ్జిక్యూటివ్‌లు భారీ ఝలక్ ఇచ్చారు. 10 లక్షల డాలర్లు పరిహారం చెల్లించాలంటూ మస్క్ నేతృత్వంలోని ట్విటర్ పై దావా వేశారు. అమెరికాలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వ్యాజ్యాలు, ప్రభుత్వ విచారణలకు సంబంధించిన చట్టపరమైన ఖర్చులను చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు. భారత సంతతికి చెందిన ట్విటర్ మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్, మాజీ లీగల్ హెడ్ విజయ్ గద్దె, మాజీ సీఎఫ్‌వో సెగల్ ముగ్గురూ చట్టపరంగా తమకు రావాల్సిన చెల్లింపులు చేయాలంటూ కోర్టుకెక్కారు. ఈ మేరకు అమెరికాలోని డెలావేర్ ఛాన్సరీ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీని ప్రకారం డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అండ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్జేంజ్ పలు ధపాల విచారణలో భాగంగా తామె మెచ్చించిన లీగల్ ఫీజులకు గాను ట్విటర్ తమకు ఒక మిలియన్ డాలర్ల కంటే ఎకుకవ చెల్లించాల్సి ఉందని ముగ్గూరూ ఆరోపించారు.






