వడ్డీ రేట్ల కోతకు సమయం ఆసన్నమైంది …యూఎస్ ఫెడరల్

రేట్ల కోతకు సమయం వచ్చేసింది అంటున్నారు అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఫెడ్ రేట్ల కోతకు వేళయిందని ఆయన సంకేతాలిచ్చారు. జాక్సన్ హోల్ సింపోజియమ్‌లో పావెల్ మాట్లాడుతూ పరపతి విధానాన్ని సవరించే సమయం వచ్చింది. ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందనే ఆందోళనలు తగ్గాయి. ఉద్యోగావకాశాలూ తగ్గే సూచనలు కనిపించడం లేదు. ద్రవ్యోల్బణం 2.5 శాతానికి, నిరుద్యోగ రేటు 4.3 శాతానికి పరిమితమయ్యాయి. ఈ సమయంలో రేట్ల కోతకు మరింత కాలం వేచిచూడాలని మేం అనుకోవడం లేదని పావెల్ అన్నారు. ప్రస్తుతం 23 ఏళ్ల గరిష్ఠ స్థాయి వద్ద ఉన్న కీలక వడ్డీ రేట్లను సెప్టెంబరులో 25`50 బేసిస్ పాయింట్ల మేర ఫెడ్ తగ్గించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.