Tesla: భారత మార్కెట్లోకి టెస్లా ఎంట్రీ

అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) భారత మార్కెట్లోకి ప్రవేశించింది. మహారాష్ట్ర రాజధాని ముంబయి (Mumbai)లో తొలి షోరూంను ప్రారంభించింది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని మార్కర్ మ్యాక్సిటీ మాల్‌లో దానిని తెరిచింది. ఈ షోరూం ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis) హాజరయ్యారు. ఈ సంస్థకు వెల్‌కమ్ చెప్పారు. భారత్‌లో ఈ ఎలక్ట్రిక్ కార్ల (Electric cars ) తయారీకి సంబంధించిన భవిష్యత్ ప్రణాళికలపై ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోడల్ వై కారు (Model Y car) ను సంస్థ ఆవిష్కరించింది. తొలుత మోడల్ వై ఈవీలను టెస్లా భారత్ మార్కెట్లో విక్రయించనుంది. ఇక్కడ ఆర్‌డబ్ల్యూడీ వెర్షన్ ( బేస్) మోడల్ వై ధర రూ.61.07 లక్షలుగా (ఆన్‌రోడ్) నిర్ణయించింది. లాంగ్ -రేంజ్ వెర్షన్ ధర రూ.69.15 లక్షలుగా ఉంది.