అమెరికాలో చరిత్ర సృష్టించిన టీసీఎస్
టాటాలకు చెందిన భారతీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) దేశంలోనే కాక అగ్రరాజ్యం అమెరికాలోనూ కొత్త చరిత్ర సృష్టిస్తోంది. అమెరికాలో ఉద్యోగాలను కల్పిస్తున్న పెద్ద కంపెనీల జాబితాలో ఈ భారత సంస్థ నిలిచింది. ఉద్యోగాల కల్పన గడిచిన మూడేళ్లలో టీసీఎస్ దాదాపు 21 వేల మందికి పైగా ఉద్యోగులను నియమించుకుంది. తాజా ఫోర్బ్స్ అమెరికా వార్షిక ఉత్తమ పెద్ద ఉద్యోగాల జాబితాలో టీసీఎస్ స్థానం సంపాదించింది. ఇటీవల ఫార్చ్యూన్ మ్యాగజైన్ టీసీఎస్‌ను తన 2023లో ప్రపంచంలోనే అత్యంత ఆరాధించే కంపెనీల జాబితాలో చేర్చింది. అదే విధంగా కేర్బ్లిస్ టిసిఎస్‌ను 2023లో తన 50 హ్యాపీయెస్ట్ కంపెనీల జాబితాలో చేర్చింది.






