Trade Deal : భారత్- అమెరికా మధ్య… త్వరలోనే

టారిఫ్‌ల తగ్గింపు, మార్కెట్ అందుబాటు, డిజిటల్ (Digital) వాణిజ్యం పెంపు దిశగా భారత్-అమెరికా (India-America) మధ్య జరుగుతున్న చర్చల్లో మెరుగైన పురోగతి లభించింది. మరికొన్ని వారాల్లో ఇరుదేశాల మధ్య మధ్యంతర ట్రేడ్ డీల్ (Trade Deal) కుదిరే అవకాశాలు కన్పిస్తున్నాయి. రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న 190 బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు పెంచాలనే లక్ష్యంతో ఈ చర్చలు జరుగుతున్నాయి. వాణిజ్య అంశాలపై ఇరుదేశాల ప్రతినిధుల మధ్య ఢల్లీి వేదికగా నాలుగు రోజుల పాటు జరిగిన చర్చలు ముగిశాయి. పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ అందుబాటు, సుంకాలు తగ్గింపు, టారిఫ్ (Tariff) మినహాయింపులు వంటి ప్రధాన అజెండాగా ఈ చర్చలు సాగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడిరచాయి. పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా సమతుల్య ఒప్పందం దిశగా చర్చల్లో పురోగతి లభించినట్లు పేర్కొన్నాయి.