అమెరికాలో మరో సంక్షోభం!
అమెరికా బ్యాకింగ్ రంగంలో మళ్లీ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. తాజాగా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) కుప్పకూలింది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు ఆ బ్యాంక్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. డిపాజిట్లు, బ్యాంకు ఆస్తుల మధ్య పొంతన లేకపోవడంతో అమెరికా ప్రభుత్వ నిర్వహణలోని ది ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎఫ్డీఐసీ) సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఆస్తులను స్వాధీనం చేసుకుంది. 2008లో వాషింగ్టన్ మ్యూచువల్ తర్వాత అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థలో ఇతే అతిపెద్ద వైఫల్యంగా భావిస్తున్నారు. దీంతో 2008 నాటి లేమన్ బ్రదర్స్ బ్యాంకులా ఎస్వీబీ అమెరికా బ్యాంకింగ్ రంగంలో మరో ఆర్థిక సంక్షోభానికి కారణమవుతుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.






