భారత్-రష్యా మధ్య కుదిరిన ఒప్పందం.. ఇకపై వారానికి
భారత్-రష్యా మధ్య ఇకపై వారానికి 64 విమానాలు తిరగనున్నాయి. గతంలో ఇరు దేశాల మధ్య ఉన్న ఒడంబడిక ప్రకారం వారానికి 52 విమానాలు నడిచేవి. ఇకపై ఆ సంఖ్యను 64కు పెంచుకునేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. ఈ మేరకు ఒప్పందాన్ని త్వరలో సవరించనున్నట్లు భారత దేశానికి చెందిన ఓ విమాన యాన అధికారి తెలిపారు. ప్రస్తుతం రష్యాకు చెందిన ఏరోఫ్లాట్ విమానయాన సంస్థ మాత్రమే రెండు దేశాల మధ్య విమానాలు నడుపుతోంది. గతంలో భారత్ నుంచి ఎయిర్ ఇండియా రష్యాకు విమానాలు నడిపేది. కానీ ఆ దేశంలో నెలకొన్న అనిశ్చితి, యుద్ధ వాతావరణం దృష్ట్యా వాటిని నిలిపేసింది. తాజా ఒప్పందం ప్రకారం భారత్లోని 6 ప్రధాన నగరాలకు రష్యా విమానాలు నడపనుంది.






