జియో చేతికి అమెరికా కంపెనీ!
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ అమెరికాకు చెందిన కమ్యూనికేషన్స్ సామగ్రి తయారీ సంస్థ మిమోసా నెట్ వర్క్స్‌ను 60 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.490 కోట్లు)తో కొనుగోలు చేసింది. 5జీ టెలికాం. బ్రాడ్‌బ్యాండ్ సేవలను మరింత బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. మిమోసా నెట్‌వర్క్స్‌ను కొనుగోలు చేసేందుకు అమెరికాకు చెందిన ఎయిర్‌స్పాన్ నెట్ వర్క్స్ హాల్డింగ్స్తో జియో ప్లాట్‌ఫామ్స్ అనుబంద సంస్థ రాడిసిస్ కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇరు కంపెనీలు పేర్కొన్నాయి. వైఫై-5తో పాటు సరికొత్త వైఫై 6ఈ సాంకేతికత ఆధారంగా పాయింట్ టు మల్టీ పాయింట్ ఉత్పత్తులతో పాటు సంబంధిత విడిభాగాలనూ మిమోసా తయారు చేస్తోంది. ఇంత వరకు ఈ కంపెనీకి ప్రధాన వినియోగదారుగా ఉన్న జియో ఇప్పుడు యజమానిగా మారనుంది. చైనా సాంకేతికత నుంచి దూరం జరగాలని ప్రపంచ దేశాలు భావిస్తున్న ఈ తరుణంలో ఈ పరిణామం చేసుకోవడం విశేషం. 2018లో మిమోసాను ఎయిర్‌స్పాన్ కొనుగోలు చేసింది.






