జీ 20 దేశాల్లో సౌదీ అరేబియా తర్వాత భారతే
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.6 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుందని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో పారేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) అంచనా వేసింది. తద్వారా ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా నిలస్తుందని పేర్కొంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించినప్పటికీ భారత్ ఈ హోదాను నిలబెట్టుకుందని పేర్కొంది. జీ 20 దేశాల్లో సౌదీ అరేబియా తర్వాత భారతే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశమని తెలిపింది. అయితే 2023-24లో భారత్ వృద్ధి 5.7 శాతానికి నెమ్మదిస్తుందని వెల్లడించింది. ఎగుమతులతో పాటు దేశీయంగా గిరాకీ తగ్గుతుండటం ఇందుకు కారణమని పేర్కొంది. మళ్లీ 2024-25లో వృద్ధి రేటు 7 శాతానికి పుంజుకుంటుందని ఓఈసీడీ వివరించింది.






