ఉద్యోగులకు గూగుల్ మరో షాక్
ఉద్యోగులకు గూగుల్ మరో షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకూ ఉద్యోగులకు అందిస్తున్న ఉచిత ఫలహారాలు ( స్నాక్స్), భోజనం, లాండ్రీ సేవలు, ఫిట్నెస్ సెంటర్లు, మసాజ్ సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. వ్యయ నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ ఏడాది దాదాపు 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. నూతన నియామకాల్లోనూ దూకుడు తగ్గించాలని సంస్థ ఇప్పటికే నిర్ణయించింది. కంపెనీ నిధులను అత్యున్నత ప్రాధాన్యం ఉన్న అంశాలకే వినియోగించాలని, కంపెనీ ముఖ్య ఆర్థిక అధికారి రుత్ పోరట్ సూచించారట.






