గీతా గోపీనాథ్ తో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ భేటీ
అమెరికా పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రపంచ బ్యాంకు వార్షిక సదస్సులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పెరుగుతున్న వడ్డీ రేట్లు, పెరిగిన రుణాలు, ఆర్థిక రంగానికి ఉన్న ప్రతికూల పరిస్థితులు, ద్రవ్యోల్బణం, భౌగోళిక, రాజకీయ అంశాలు, చైనాలో ఆర్థిక క్షీణత వంటి అంశాలపై చర్చించారు. ఈ పర్యటనలో భాగంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ తో సీతారామన్ భేటీ అయ్యారు. ఈ భేటీలో రుణ సమస్యలు, ఇతర అంశాలపై చర్చించారు. ఆర్థిక మంత్రితో మంచి చర్చలు జరిగాయి. జీ20కి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతదేశం రుణ సమస్యలు, క్రిప్టో సంబంధిత సవాళ్లపై పురోగతిని సాధిస్తోంది అని గోపీనాథ్ తెలిపారు.






