రాబోయే ఐదేండ్లలో ఆర్థిక సునామీ తప్పదు : జై శంకర్
రాబోయే ఐదేండ్లు భారత్ సహా ప్రపంచం గడ్డు పరిస్థితులను ఎదుర్కోనుందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయే అర్థ దశాబ్దంలో దీటుగా ముందుకు సాగేందుకు భారత్కు సమర్థవంతమైన నాయకత్వం అవసరమని అన్నారు. ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నా భారత్ మెరుగైన స్థితిలోనే ఉందని, ప్రపంచానికి దిక్సూచీలా భారత్ ఉంటుందని ఐఎంఎఫ్ గుర్తించిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు సంక్లిష్టంగా మారితే భారత్కు గడ్డుకాలం తప్పదని అన్నారు. రాబోయే ఐదేండ్లలో ఆర్థిక సునామీ తప్పదని అన్నారు. ఈ క్రమంలో మనకు దీటైన నాయకత్వం అవసరమని స్పష్టం చేశారు. సరైన వ్యవస్థలను గాడిలో పెట్టి సంక్ష్లిష్ట పరిస్థితులను విశ్వాసంతో ఎదుర్కొని సరైన జడ్జిమెంట్తో మనం ముందుకెళ్లాలని అన్నారు. ప్రపంచ చోదక శక్తి భారత్ పట్ల ప్రపంచం ఇదే దృక్పధాన్ని కలిగి ఉందని అన్నారు. భారత్ వృద్ధి రేటు కొనసాగుతుందని ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయని ఆయన గుర్తు చేశారు.






