అమెరికా నుంచి భారత్ కు నిసార్ వచ్చేసింది
అమెరికాకు చెందిన నాసా, భారత్‌కు చెందిన ఇస్రో సంయుక్తంగా అభివృద్ది చేసిన నిసార్ ఉపగ్రహం ఇస్రో చెంతకు చేరింది. నాసా-ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ (నిసార్)ను అమెరికాలోని కాలిఫోర్నియాలో తయరు చేయగా ఆ దేశవాయుసేనకు చెందిన సీ-17 విమానం దానిని బెంగళూరుకు తీసుకొచ్చింది. నిసార్ భారత్‌కు వచ్చేసింది. ఎర్త్ అజ్జర్వేషన్ శాటిలైట్ తుది ఇంటిగ్రేషన్ మొదలైంది అని చెన్నైలోని అమెరికా కాన్సులేట్ జనరల్ తెలిపింది. వ్యవసాయ సంబంధ మ్యాపింగ్, కొండచరియలు విరిగే ప్రమాదమున్న ప్రాంతాల గుర్తింపు తదితర కోసం నిసార్‌ను వినియోగించనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని సతీశ్ ధమన్ అంతరిక్ష ప్రయోగం కేంద్రం నుంచి వచ్చే ఏడాదిలో ఈ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించనుంది.






