ప్రపంచ కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ అగ్రస్థానం
ఆసియాలోనే సంపన్న వ్యక్తిగా ముకేశ్ అంబానీ మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఇక అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ 24వ స్థానానికి పడీపోయారు. 2023కు ప్రపంచ కుబేరుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. 83.4 బిలియన్ డాలర్ల నికర సంపదతో ముకేశ్ అంబానీ ఆసియాలో అగ్రస్థానంలో, ప్రపంచ కుబేరుల్లో 9వ స్థానంలో నిలిచారు. జనవరి 24న అదానీ 126 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో మూడో సంపన్నుడిగా ఉన్నారు. అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత ప్రస్తుతం ఆయన సంపద 47.2 బిలియన్ డాలర్లకు పడిపోయింది అని ఫోర్బ్స్ తెలిపింది. అంబానీ తర్వాత రెండో ధనిక భారతీయుడిగా అదానీ నిలిచారు. గతేడాది అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ 100 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అధినమించిన తొలి భారతీయ సంస్థగా అవతరించింది.






