Microsoft: మైక్రోసాఫ్ట్‌లో మరోసారి లేఆఫ్‌లు!

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) వచ్చేవారం భారీ సంఖ్యలో ఉద్యోగుల (Employees)ను తొలగించేందుకు సిద్ధమవుతోంది. ఈసారి ఎక్స్‌బాక్స్ (Xbox) విభాగంలో ఉద్యోగులను ఆ సంస్థ లక్ష్యంగా చేసుకొన్నట్లు తెలిసింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు సంస్థను పునర్ వ్యవస్థీకరించడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడిరచింది. గత 18 నెలల్లో ఆ సంస్థ ప్రకటించిన నాలుగో అతిపెద్ద లేఆఫ్ కానుంది. ముఖ్యంగా 69 బిలియన్ డాలర్లు వెచ్చింది యాక్టివిజన్ బ్లిజార్డ్ (Activision Blizzard )ను కొనుగోలు చేశాక లాభదాయకతపై దృష్టిసారించాలని ఒత్తిళ్లు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. రానున్న లేఆఫ్ (Layoff) లో ఎక్స్‌బాక్స్ గ్రూప్‌లోని చాలా బృందాలు ప్రభావితం కానున్నట్లు తెలుస్తోంది.