మెటాలో మరో 10 వేల మంది ఔట్
ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా మాతృసంస్థ మెటా మరో 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. ఇంకో 5,000 ఖాలీలను కొత్త వారితో భర్తీ చేయకూడదనీ నిర్ణయించింది. 4 నెలల్లో మెటా భారీగా ఉద్యోగాలను తొలగించడం ఇది రెండోసారి. గత నవంబరులో 11,000 మంది ఉద్యోగులను తొలగించింది. ప్రతికూల వ్యాపార పరిస్థితుల నేపథ్యంలో సంస్థ ఆర్థిక స్థితిని కాపాడుకునేందుకు వ్యయాలు తగ్గించుకుంటున్నామని, ఇందులో భాగంగానే ఉద్యోగుల సంఖ్యను కుదిస్తున్నట్టు మెటా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రకటించిన ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ వచ్చే నెలల్లో జరుగుతుందని సీఈఓ మార్క్ జుకర్బర్గ్ తెలిపారు.






