మెక్ డొనాల్డ్స్ సంచలన నిర్ణయం… అమెరికాలోని
ప్రపంచంలోని అతిపెద్ద ఫాస్ట్ఫుడ్ చెన్లలో ఒకటైన మెక్డొనాల్డ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని అన్ని కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేసింది. ఈ మేరకు ఉద్యోగాలపై వేటు వేయనుంది. తాజాగా మరో రౌండ్ తొలగింపులకి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. అయితే ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తారనే దానిపై స్పష్టత లేదు. సోమవారం నుంచి బుధవారం వరకు ఇంటి నుండి పని చేయడం ప్రారంభించాలని కంపెనీ గత వారమే మెక్ డొనాల్డ్స్ అమెరికా ఉద్యోగులకు మెయిల్ పంపింది. ఈ వారంలో షెడ్యూల్ అయిన అన్ని వ్యక్తిగత సమావేశాలను రద్దు చేయాలని కూడా కంపెనీ ఉద్యోగులను కోరినట్లు తెలుస్తోంది. అయితే ఏప్రిల్ 5, బుధవారం దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంచనా. త్వరలోనే ఉద్యోగులను తీసివేయనున్నట్టు కూడా మెక్ డొనాల్డ్స్ ప్రకటించనుంది.






