మనసు మార్చుకున్న ఎలాన్ మస్క్… ఇప్పుడు అదే నిజమైంది
ట్విటర్ లోగోగా ఉన్న డోజ్ (కుక్క) స్థానంలో మళ్లీ పక్షి వచ్చింది. మూడు రోజుల కిందట ట్విటర్ తన లోగో అయిన బ్లూబర్డ్ను తొలగించి దాని స్థానంలో డోజ్కాయిన్ క్రిప్టోకరెన్సీ లోగో అయిన డోజ్మీమ్ను లోగోగా మార్చింది. ఓ వినియోగదారుడికి ఇచ్చిన మాట ప్రకారమే అలా చేసినట్లు సంస్థ అధినేత ఎలాన్‌మస్క్ ప్రకటించారు. అయితే ఆ మార్పు శాశ్వతంగా ఉంటుందా లేదా అన్న విషయమూ మస్క్ అప్పుడు స్పష్టత ఇవ్వలేదు. సామాజిక మాధ్యమాల్లో సరదాగా ఈ డోజ్మీమ్ను వాడుతుంటారు. దీంతో మస్క్ కూడా సరదాగా దీన్ని ఏర్పాటు చేసి ఉంటారనీ, కొన్ని రోజులే ఇది ట్విటర్ లోగోగా ఉంటుందనే భావనలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు అదే నిజమైంది. ట్విటర్ ప్రారంభం నుంచి ఉన్న బ్లూబర్డ్ లోగోను ఆ సంస్థ పునరుద్ధరించింది. ఎలాన్ మస్క్ ట్విటర్ లోగోను మార్చిన తర్వాత డోజ్కాయిన్ విలువ 20 శాతానికి పైగా పెరగడం గమనార్హం.






